Trending News:
టీజర్‌లోనే ఇన్ని బూతులు ఉంటే.. ఇక సినిమా పరిస్థితి ఏంటో..?
ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో బూతు డైలాగ్స్‌కు ఎలాంటి కొదవ లేదని చెప్పవచ్చు.
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్
తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పెళ్లి చేసుకున్నారు.
చరిత్రపుటల్లోకెక్కిన మ్యాక్స్‌వెల్.. అత్యంత వేగంగా..!
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ చరిత్రపుటల్లకెక్కాడు.
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తిరిగి తన ఫామ్‌ను అందుకున్నాడు.
నాకు నువ్వు కావాలి, అవసరమైతే లేపుకెళ్లిపోతా: నిఖిల్
హౌస్‌మేట్స్ తమ మొదటి ప్రేమకథ చెప్పాలన్నాడు బిగ్‌బాస్
Notification
సాక్షి, తణుకు: ఏపీ సీఎం చంద్రబాబు సూపర...
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేత యనమల రామ...
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలోనూ కూట�...
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్ర�...
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు మరోసారి �...
జెరూసలేం: గాజా, హిజ్బొల్లాపై ఇజ్రాయె�...
అబుజా: మూడు దేశాల పర్యటనలో భాగంగా భార�...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివ�...
సాక్షి, హైదరాబాద్: మూసీ పేరుతో సంపాద�...
కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో షాకింగ...
Gold Price Today: దేశంలో బంగారం ధరల్లో నేడు (నవం�...
లక్నో: ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని మహార...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లగచర్ల �...
చెన్నై: తమిళనాడులో షాకింగ్ ఘటన చోటు�...
Select Your Preferred Category to see your Personalized Content
- ఆంధ్రప్రదేశ్
- సాక్షిపోస్ట్
- సాక్షి ఒరిజినల్స్
- గుడ్ న్యూస్
- ఏపీ వార్తలు
- ఫ్యాక్ట్ చెక్
- శ్రీ సత్యసాయి
- తూర్పు గోదావరి
- డా. బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ
- శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
- అల్లూరి సీతారామరాజు
- పార్వతీపురం మన్యం
- పశ్చిమ గోదావరి
- తెలంగాణ వార్తలు
- మహబూబ్‌నగర్
- నాగర్ కర్నూల్
- ఇతర క్రీడలు
- పర్సనల్ ఫైనాన్స్
- ఉమెన్ పవర్
- వింతలు విశేషాలు
- లైఫ్‌స్టైల్
- వైఎస్ జగన్
- మీకు తెలుసా?
- మేటి చిత్రాలు
- వెబ్ స్టోరీస్
- డింగ్ డాంగ్ 2.0
- గరం గరం వార్తలు
- యూట్యూబ్ స్పెషల్
- గెస్ట్ కాలమ్
- సోషల్ మీడియా
- పాడ్‌కాస్ట్
‘మట్కా’ మూవీ రివ్యూ
Published Thu, Nov 14 2024 4:23 PM | Last Updated on Fri, Nov 15 2024 9:00 AM
టైటిల్: మట్కా నటీనటులు: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు నిర్మాణ సంస్థ: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి దర్శకత్వం: కరుణ కుమార్ సంగీతం: జీవీ ప్రకాశ్ సినిమాటోగ్రఫీ: ఎ కిశోర్ కుమార్ ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్ విడుదల తేది: నవంబర్ 14, 2024
కథేంటంటే.. బర్మా నుంచి వైజాగ్ వచ్చిన వాసు దేవ్ అలియాస్ వాసు(వరుణ్ తేజ్)..చిన్నప్పుడే అనుకోకుండా ఓ వ్యక్తిని హత్య చేసి జైలుకు వెళ్తాడు. అక్కడ జైలు వార్డెన్ నారాయణ మూర్తి(రవిశంకర్)తో మంచి పరిచయం ఏర్పడుతుంది. వాసుని తన సొంత పనులకు వాడుకుంటూ మంచి ఫైటర్‌లా తయారు చేస్తారు. జైలు నుంచి బయటకు వచ్చిన వాసు.. కొప్పరికాయల వ్యాపారి అప్పల రెడ్డి(అజయ్ ఘోష్) దగ్గర పనిలో చేరతాడు. ఓ సారి ఆ ఏరియా రౌడీ కేబీఆర్ గ్యాంగ్‌ని చితక్కోట్టి..అతని ప్రత్యర్థి నానిబాబు(కిశోర్)కి దగ్గరవుతాడు. అతని అండదండలతో పూర్ణ మార్కెట్ నాయకుడిగా ఎదుగుతాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ.. చివరకు మాట్కా ఆటను ప్రారంభిస్తాడు. ఆ తర్వాత వాసు జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏంటి? మట్కా కింగ్‌గా ఆయన ఎలా ఎదిగాడు? సెల్ ఫోన్ లేని రోజుల్లో దేశం మొత్తానికి ఒక నెంబర్ ని ఎలా పంపించాడు? వాసు కోసం సీబీఐ ఎందుకు రంగంలోకి దిగింది? సుజాత(మీనాక్షి చౌదరి) వాసు జీవితంలోకి ఎలా వచ్చింది? ఈ కథలో సోఫియా(నోరా ఫతేహి), సాహు(నవీన్ చంద్ర) పాత్రలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే.. ‘మట్కా కింగ్’ రతన్ లాల్ ఖత్రీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘మట్కా’. గ్యాoబ్లింగ్ వరల్డ్ లో రతన్ ఖత్రీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 1962లో ముంబైలో కేంద్రంగా మట్కా గ్యాంబ్లింగ్ లో దేశం మొత్తం పెద్ద నెట్‌వర్క్‌ను సృష్టించాడు. ఖత్రీ క్యారెక్టర్ స్ఫూర్తితో వాసు క్యారెక్టర్ ని డిజైన్ చేసి మట్కా చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కరుణ కుమార్. కథగా చూస్తే ఇది కేజీయఫ్, పుష్ప లాంటి అండర్ డాగ్ స్టోరీ.
చేతిలో చిల్లిగవ్వ లేని హీరో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టడం.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి..ప్రభుత్వాలనే శాసించే స్థితికి రావడం.. గ్యాంగ్‌స్టర్ కథలన్నీ ఇలానే ఉంటాయి. మట్కా కథనం కూడా ఇలానే సాగుతుంది. అయితే ఓ ఆటను అడ్డుపెట్టుకొని ఓ వ్యక్తి దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా సంక్షోభంలో పడేశాడనేది కొత్త పాయింట్. కథకు ఇదే మెయిన్ పాయింట్ కూడా. కానీ తెరపై మాత్రం దాన్ని అంతే బలంగా చూపించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. ఎలాంటి ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకుండా చాలా రొటీన్‌గా కథనాన్ని నడిపించాడు.
హీరో మట్కా కింగ్‌గా ఎదిగిన క్రమం కూడా సినిమాటిక్‌గా అనిపిస్తుంది కానీ ఎక్కడా సహజంగా కనిపించదు. ఇక కథకి కీలకమైన మట్కా ఆట కూడా ఇంటర్వెల్ వరకు మొదలు కాదు. సెకండాఫ్‌లో అయినా ఆ ఆటని హైలెట్ చేశారా? అంటే అదీ లేదు. కథనం మొత్తం రొటీన్‌గా సాగుతుంది. హీరో పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా పండలేదు. ఫస్టాఫ్ మొత్తం హీరో బాల్యం, అతను ఎదిగిన క్రమం చూపిస్తూ.. మట్కా ఆటలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారనే చూపించారు. ఇక సెకండాఫ్‌లో మట్కా ఆటతో వాసు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా సంక్షోభంలో పడేశాడు? అతన్ని పట్టుకునేందుకు సీబీఐ రంగంలోకి దిగడం..మరోవైపు ప్రత్యర్థులు అతన్ని చంపేందుకు కుట్ర చేయడం.. వాటిని హీరో ఎలా తిప్పికొట్డానేది చూపించారు. అయితే ఈ సన్నివేశాలేవి ఆకట్టుకునేలా ఉండవు. చివరల్లో దావూద్ పాత్రని పరిచయం చేసి.. క్రికెట్ బెట్టింగ్‌తో సీక్వెల్ ఉంటుందని పరోక్షంగా ప్రకటించారు. ఎవరెలా చేశారంటే.. వాసు పాత్రకి వరుణ్ తేజ్ న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. వాసు భార్య సుజాతగా మీనాక్షి చౌదరి తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదు. సోఫియాగా నోరా ఫతేహి తెరపై అందంగా కనిపించింది. కిషోర్, నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జీవీ ప్రకాశ్ సంగీతం సినిమాకి ప్రధాన బలం. సినిమాటోగ్రపీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -రేటింగ్: 2.25/5
Add a comment
Related news by category.
- Kanguva Review: 'కంగువా' మూవీ రివ్యూ టైటిల్: కంగువానటీనటులు: సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులునిర్మాణ సంస్థ: స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్దర్శకత్వం: శివసంగీతం: దేవీవ...
- 'రహస్యం ఇదం జగత్' మూవీ రివ్యూ టైటిల్: రహస్యం ఇదం జగత్నటీనటులు: రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ తదితరులుదర్శకత్వం: కోమల్ ఆర్ భరద్వాజ్‌సంగీతం: గ్యానీఎడిటర్: ఛోటా కే ప్రసాద్సినిమాటోగ్రఫీ: టై...
- టాలీవుడ్ మూవీ జ్యువెల్ థీఫ్ రివ్యూ.. ఎలా ఉందంటే? టైటిల్: జ్యూవెల్ థీఫ్ - మూవీ రివ్యూనటీనటులు: కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్, అజయ్ తదితరులుడైరెక్టర్: పీఎస్ నారాయణనిర్మాత: మల్లెల ప్రభాకర్నిర్మాణ సంస్థ: శ్రీ విష్ణు గ్లోబల్ మీడియాసంగీతం: ఎం. ...
- ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ రివ్యూ నిఖిల్ సీనీ కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘స్వామిరారా’ ఒక్కటి. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘కేశవ’ కూడా మంచి ప్రశంసలు దక...
- 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ 'స్టార్', 'దాదా' లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు కవిన్. ఇతడు బిచ్చగాడు పాత్రలో నటించిన మూవీ 'బ్లడీ బెగ్గర్'. దీపావళి సందర్భంగా తమిళంలో రిలీజైంది. వారం తర్వ...
Related News By Tags
- సెట్‌లో స్టార్ట్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లు. కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ పాన్ ఇండియన్ చిత్రాన్ని విజయేందర్ రెడ్డి తీ...
- అలా చేయలేని రోజు సినిమాలు మానేస్తాను: కరుణ కుమార్ ‘‘సెట్‌లో కూడా స్టార్ హీరోలుగా ఉండే ఆర్టిస్టులను హ్యాండిల్ చేయడం నాకు కాస్త కష్టంగా ఉంటుంది. కానీ, తన స్టార్ హీరో ఇమేజ్‌ని బయటపెట్టి సెట్స్‌లో అందరితో హుందాగా ఉంటారు వరుణ్ తేజ్. ‘పలాస 1978’ సినిమ...
- వరుణ్ తేజ్ 'మట్కా' ట్రైలర్ రిలీజ్ 'మట్కా' మూవీ ట్రైలర్ రిలీజైంది. చాన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న మెగాహీరో వరుణ్ తేజ్.. ఈ సినిమాపై బోలెడన్ని ఆశలన్ని పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్లే ట్రైలర్ ఉంది. 'మట్కా' అనే గేమ్ నేపథ్య కథత...
- గ్యాంగ్‌స్టర్‌గా వరుణ్ తేజ్.. ‘మట్కా’ గ్లింప్స్ చూశారా? మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , ‘పలాస 1978’ఫేమ్ కరుణ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మట్కా’. . వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి SRT ఎంటర్...
- హైదరాబాద్‌లో వైజాగ్ యాక్షన్ మోడ్‌లోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు హీరో వరుణ్ తేజ్. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న యాక్షన్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌద...
కూతురితో ప్రియాంక విహారం.. లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో అలా!
పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్.. గోవాలో పెళ్లి? (ఫోటోలు)
గ్లామర్ బెండు తీసేస్తున్న యాంకర్ రష్మీ (ఫొటోలు)
గృహ ప్రవేశం.. పట్టుచీరలో 'జబర్దస్త్' సత్యశ్రీ (ఫొటోలు)
మేము ఇప్పుడు నలుగురం: ప్రకటించిన రోహిత్ శర్మ, రితికా సజ్దే (ఫొటోలు)
బాబు హయాంలో నిత్యావసరాల ధరలకు రెక్కలు: కారుమూరి
ఢిల్లీలో సెంటిమెంట్.. కేటీఆర్ అరెస్ట్ కథ కంచికి : బండి సంజయ్
ఆమ్ ఆద్మీ పార్టీకి మంత్రి కైలాష్ గెహ్లాట్ రాజీనామా
తమ్ముడి మృతదేహానికి నివాళులర్పించిన చంద్రబాబు
చంద్రబాబు కరెంట్ చార్జీలు పెంచబోమని చెప్పి మాట తప్పారు: CPI రామకృష్ణ
IMAGES
VIDEO